
షాంపూను నేరుగా కాకుండా కొన్ని నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయడం మనకు తెలిసిందే. అయితే నీటితో పాటు కొన్ని పదార్థాలను షాంపూలో కలుపుకొని తలస్నానం చేయచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. షాంపూను నేరుగా కాకుండా కొన్ని నీళ్లలో కలుపుకొని తలస్నానం చేయడం మనకు తెలిసిందే. అయితే నీటితో పాటు కొన్ని పదార్థాలను షాంపూలో కలుపుకొని తలస్నానం చేయచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు. ⚛ రోజ్‌వాటర్‌లో షాంపూను కలిపి తలస్నానం చేస్తే కుదుళ్లలో దురద, అలర్జీ.. మొదలైన వాటి నుంచి ఉపశమనం లభిస్తుందట. అంతేకాదు.. జుట్టు మెత్తగా, పట్టుకుచ్చులా మెరుస్తుందంటున్నారు నిపుణులు. ⚛ రోజ్‌మేరీ, లావెండర్‌, పెప్పర్‌మింట్‌, టీట్రీ నూనెల్లో ఏదైనా ఒకదాన్ని షాంపూలో కలపడం వల్ల జుట్టు రాలడం తగ్గి మరింత ఒత్తుగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ⚛ షాంపూలో కొద్దిగా నిమ్మరసం కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకలు నిగనిగలాడుతూ పట్టుకుచ్చులా మెరుస్తాయట. ⚛ షాంపూలో కాస్త తేనె కలిపితే జుట్టు పొడిబారకుండా తేమను సంతరించుకుంటుంది. తేనె కుదుళ్లను ఆరోగ్యంగా మారుస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఈ చిట్కాలు సహజసిద్ధమైనవే అయినప్పటికీ.. చర్మతత్వానికి సరిపడతాయో లేదో తెలుసుకోవడానికి ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings




