
మంథని గ్రామీణం: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అని పిలుపునిచ్చారు. వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలని, మట్టి గణపతి విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. గణపతి ఉత్సవాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు తదితర ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలగడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, ఎల్లంకి వంశీధర్, నాయకులు జంభోజు సమ్మయ్య, లైశెట్టి రాజు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
