
మేష రాశి వారికి ఈరోజు వినాయక చవితి రోజు న శుభ యోగాల ప్రభావంతో విశేష ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అయితే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేదంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే మీకు తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశి వారికి గణేష్ చతుర్థి రోజున శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఏర్పడే శుభ యగాల ప్రభావంతో మీరు చేసే పనులన్నీ విజయవంతం కావొచ్చు. ఈ సాయంత్రం మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఈరోజు మీరు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బయటి ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. మిథున రాశి వారు ఈరోజు వినాయకుని అనుగ్రహంతో చాలా ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తి చేయొచ్చు. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించొచ్చు. పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు గురుడు, వినాయకుడి అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉది. ఈరోజు మీరు చేసే పనులను సకాలంలో పూర్తి చేయొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలన్నీ తొలగిపోయే అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిహారం : ఈరోజు గణపతికి ప్రత్యేక పూజలు చేయాలి. సింహ రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. శుభ యోగాల ప్రభావంతో మీరు కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంది. మీకు బంధువుల నుంచి మద్దతు లభించొచ్చు. వారి సహకారంతో కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. మరోవైపు మీ కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదాలు రావొచ్చు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వినాయకుడి ప్రత్యేక ఆశీస్సులతో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా ఉన్న ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. తులా రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు అన్ని విషయాలు పరిశీలించాలి. పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మొదటి భాగంలో మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన పనులు విజయవంతం కావాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీ కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది. రెండో భాగంలో అంటే సాయంత్రం సమయంలో వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయాణం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. ఈరోజు ఒక నిర్దిష్ట పనికి సంబంధించి ఆందోళనలు తగ్గిపోతాయి. పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. ధనస్సు రాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వినాయకుడి అనుగ్రహంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే సహోద్యోగులతో వాదనలకు దిగకూడదు వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. మీ కోరికలు చాలా వరకు నెరవేరొచ్చు. మీరు చేసే ప్రయాణాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిహారం : ఈరోజు వినాయకుడికి మోదకం సమర్పించి, పూజలు చేయాలి. మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే మరింత కష్టపడాలి. విద్యార్థులు సీనియర్లు, గురువుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. అప్పుడే మీరు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. పరిహారం : ఈరోజు లక్ష్మీదేవి మంత్రాలను పఠించాలి. కుంభ రాశి వారికి ఈరోజు వినాయకుడు, రాహువు అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీకు తోబుట్టువుల నుంచి ఆశించిన మేరకు మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం గురించి శుభవార్తలు వినొచ్చు. పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. మీన రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. శని దేవుడు, వినాయకుడి అనుగ్రహంతో మీ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు. సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభిస్తుంది. మరోవైపు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News



