
ఎక్కువ కాలం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండేందుకు మైకల్ జాక్సన్ తన ఆరోగ్యంపై విపరీతమైన శ్రద్ధ పెట్టేవాడని చెబుతారు. ఆయన చుట్టూ పలువురు వైద్యులు, ట్రైనర్లు ఉండేవారని, ఆహారం నుంచి వ్యాయామం వరకు ప్రతి విషయాన్ని నిపుణుల పర్యవేక్షణలో చేసేవాడని ప్రచారం జరిగింది. అయితే ఈ కథనాల్లోని చాలా వివరాలకు విశ్వసనీయ ఆధారాలు లేవు. 150 ఏళ్లు జీవించాలనే లక్ష్యంతో ఆయన భారీ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయం ప్రధానంగా పాత వార్తా కథనాలు, ఇంటర్నెట్లో నేటికీ చర్చణీయాంశంగా ఉన్నాయి.





