
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తొలుత పురపాలక ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన పరిపాలనా, ఎన్నికలపరమైన ఏర్పాట్లను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ త్వరలోనే పూర్తికానుంది. అనంతరం ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను ఎస్ఈసీ చేపట్టనుంది. ఈ క్రమంలో మరో 41 కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఓటర్ల జాబితా తయారీకీ నోటిఫికేషన్లు జారీ కానుంది.





