
ఇంటర్నెట్‌ డెస్క్: ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ( Flipkart ) సీజనల్‌ ఉద్యోగాల నియామకం చేపట్టేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 2.5 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష తాత్కాలిక ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. పండగ సీజన్‌ డిమాండ్‌ను అందిపుచ్చుకొనేందుకే ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాల్లో దాదాపు 75 వేల పోస్టులను కొత్త వారికే ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్టుగా డెలివరీ సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నామని కంపెనీ తెలిపింది. లాస్ట్‌ మైల్‌ డెలివరీ సేవలకే దాదాపు 1.4 లక్షల మంది సిబ్బందిని నియమించుకుంటున్నట్లు వెల్లడించింది. పండగ సీజన్‌ వేళ.. 900కు పైగా నూతన డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. పండగ సీజన్‌ సమీపిస్తుండటంతో ప్రత్యర్థి పోటీ సంస్థ అమెజాన్‌ కూడా దాదాపు 1.6 లక్షల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ ఛార్జీలు ఖరారు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





