
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నట వారసుడు, డెమి గాడ్ గా అభిమానులు పిలుచుకుంటున్న మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీని విశ్వంభర ఫేమ్ వశిష్ఠతో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. పైగా పాన్ ఇండియా హిట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం, పునర్జన్మల కాన్సెప్ట్ అని ఈ రోజు ఉదయం అనౌన్స్ మెంట్ రావడంతో అంచనాలు అంతకు మించి ఏర్పడ్డాయి.




