
ఆసియా కప్ 2026 విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ మంత్రి మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించడం తీవ్ర దుమారం రేపుతోంది. గత ఏడాది పురుషుల ఆసియా కప్ సమయంలోనూ భారత పురుషుల జట్టు నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా భారత మహిళల జట్టు కూడా అదే బాటలో పయనించి నఖ్వీకి షాక్ ఇచ్చింది. దుబాయ్లో జరిగిన ఫైనల్ పోరులో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి భారత మహిళల జట్టు ఛాంపియన్గా నిలిచింది. అయితే నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకూడదనే నిర్ణయం వెనుక బీసీసీఐ ముందస్తు వ్యూహం ఉంది.





