
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Mla Vemula Prashanth reddy fires on kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. అన్ని పార్టీలు కూడా పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఫుల్ కాక మీదున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే.. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. కవిత మాట్లాడుతూ.. వేముల ప్రశాంత్ రెడ్డి శకుని లాంటి వాడని అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులనైన వదిలేస్తానేమో కానీ వేముల ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలనని ఆయనకు తన ఉసురు తగులుతుందని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా.. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. కవిత వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. గతంలో తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏంపీకారంటూ మాట్లాడిన విషయంను గుర్తుచేశారు. అంతే కాకుండా కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయడం రావట్లేదని విమర్శించారని అన్నారు.
సొంత వాళ్లనే కవిత ఇష్టమున్నట్లు మాటలన్నప్పుడు తామ మీద అనడంలో ఆశ్చర్యమేముందని ఆరోపణలను కొట్టిపారేశారు. కవిత మాటలకు కేసీఆర్ ఎంతో మనో వేదనకు గురౌతున్నారని అన్నారు. కవితను కేసీఆర్‌ను కలపడానికి ప్రయత్నం చేసిన, విడగొట్టడానికి చూశాడో అన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు.
పార్టీ లైన్ దాటడం వల్ల కేసీఆర్ కవితపై వేటు వేశారన్నారు. 2001 తెలంగాణ ఆవిర్భావానికి ముందే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, టీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి అంటేనే టీఆర్ఎస్ పార్టీ అని తెల్చి చెప్పారు.
అయితే.. కాంగ్రెస్ పార్టీతో నేను మంతనాలు చేశానని అంటున్న కవిత..పార్టీ కష్టకాలంలో ఉన్న వేళ కేసీఆర్ వెంట ఉన్నది నేనా.. కవితనా?.. అంటూ కవిత వ్యాఖ్యలకు వేముల ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.
కవిత తెలంగాణలో రాజకీయంగా సానుభూతి పొందేందుకు కన్నీళ్ల రాజకీయాలు చేశారనే భావన కలుగుతోందని, అయితే ఆ అంశాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
Read more: Ramchander rao: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖునీ అయ్యింది.. బీజేపీ చీఫ్ రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో తన పాత్ర ఏమిటో కేసీఆర్ కు తెలుసని చెప్పారు. మొన్నటి వరకు కవితపై కేసీఆర్ బిడ్డగా గౌరవం ఉండేది. నిన్న చేసిన వ్యాఖ్యలతో ఆ గౌరవాన్ని ఆమె స్వయంగా కోల్పోయారని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





