
మెదక్ రూరల్: వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని వినాయక విగ్రహాలను మెదక్ మండలంలోని కోంటూర్ చెరువులో నిమజ్జనం చేసేందుకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. బారికేడ్లు, లైటింగ్, గజ ఈతగాళ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గణపతి నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ పురపాలక సంఘం ఛైర్మన్ కానుగు రాధిక, తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





