
ఉమ్మడి మెదక్, వికారాబాద్‌లపై అనిశా ప్రత్యేక దృష్టి న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్, వికారాబాద్‌: సంగారెడ్డి కలెక్టరేట్‌లోని ఇంటర్మీడియట్‌ జిల్లా కార్యాలయంలో లంచం తీసుకుంటూ డీఐవో గోవింద్‌రాం అనిశాకు చిక్కారు. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో తనిఖీలు చేసి.. వారికి అనుకూలంగా రిపోర్టు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటుండగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో అవినీతి కేసులు ఏటా పెరుగుతుండటం ఆందోళనకరం. గత 2020 నుంచి 2023 వరకు ఉమ్మడి జిల్లాలో ఏటా సగటున 8 మంది అనిశాకు చిక్కగా.. 2024 నుంచి ఆ సగటు పెరిగింది. ఏటా పది మందికి పైగా అనిశాకు చిక్కుతుండటం ఆందోళనకరం. ఎవరైనా అధికారులు లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయాలి. టోల్‌ఫ్రీ నంబరిది. ఫిర్యాదుదారు వివరాలు గోప్యంగా ఉంచుతాం. గతంకంటే అవినీతి పెరిగింది. అదే స్థాయిలో దాడులు పెంచుతున్నాం. బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. కె.సుదర్శన్, అనిశా డీఎస్పీ, ఉమ్మడి మెదక్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





