
టవల్స్ గట్టిగా మారడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అందులో ముందుగా పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా మనం పెట్టే డబ్బుని బట్టి మంచి టవల్స్ దొరుకుతాయి. మనం కాస్తా తక్కువ ధర పెడితే తక్కువ నాణ్యత టవల్స్ దొరుకుతాయి. అలాంటి టవల్స్ త్వరగా గట్టిపడతాయి. కాబట్టి, మంచి నాణ్యమైన టవల్స్ తీసుకోండి. అలానే వాటిని మీరు ఎలా మెంటెయిన్ చేస్తున్నారనేది కూడా ముఖ్యమే. వాటిని సరిగా ఉతకాలి. వాటిని ఉతకడం దగ్గర్నుంచీ నీటి రకం, ఆరబెట్టే పద్ధతి వరకూ ఇవన్నీ కూడా వీటిపై ఎఫెక్ట్ పడతాయి. దీంతో అవి గట్టిగా, గరుకుగా మారతాయి. టవల్స్‌ని సరిగ్గా ఉతకడమనేది వాటి మృదుత్వాన్ని ఎక్కువకాలం ఉండేలా చేస్తుంది. ఉతకడానికి సరైన నీరు, డిటర్జెంట్ ఉండాలి. వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు వాటర్ సాఫ్టనర్ తప్పకుండా వేయాలి. అలానే టవల్స్‌ని ఫస్ట్ టైమ్ వాడుతున్నప్పుడు ముందుగా ఉతకడం చాలా ముఖ్యం. కొత్త టవల్స్‌లో ఎప్పుడు కూడా ఎక్కువగా నూలు పోగులు, పీచుపదార్థాలు ఉంటాయి. అవి రాలి చికాకు, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. వాటిని వాడే ముందు ఉతికితే రాలిపోయే పీచుపదార్థాల సంఖ్యని తగ్గించొచ్చు. దీంతో టవల్స్ సాఫ్ట్‌గా మారతాయి. మీరు టవల్స్‌ని మెషిన్ వాష్ చేసినప్పుడు ఎక్కువ బట్టలు వేసి ఉతకడం మంచిది కాదు. అలా అని మరీ తక్కువగా ఉండకూడదు కూడా. మరో ముఖ్య విషయం ఏంటంటే టవల్స్‌ని వీలైతే మిగతా బట్టలతో కలిపి కాకుండా అన్నీ టవల్స్ ఒకసారి ఉతకండి. దీని వల్ల వాటిలోని ఫైబర్స్ పాడవ్వకుండా, చిక్కుపడకుండా ఉండి మృదువుగా ఉంటాయి. సాధారణంగా మనం వాటిని ఉతికినప్పుడు ఎక్కువగా క్లీన్ కావాలనే ఉద్దేశ్యంతో చాలా మంది ఎక్కువగా డిటర్జెంట్, కండీషనర్ వేస్తుంటారు. దీని వల్ల మంచి వాసనలు వస్తుండొచ్చు. ఫ్రెష్‌గా అనిపించొచ్చు. కానీ, ఇలా చేస్తే వాటిలోని కెమికల్స్ కారణంగా మృదుత్వం తగ్గుతుంది. కాబట్టి, ఎంత కావాలో అంతే పరిమాణంలో డిటర్జెంట్స్, లిక్విడ్స్ వేయండి. కావాలనుకుంటే వైట్ వెనిగర్ వాడడం మంచిది. టవల్స్‌ని ఎప్పుడు కూడా నేరుగా ఎండలో ఆరేయొద్దు. దీని వల్ల టవల్స్ గరుకుగా మారతాయి. వీటిని బాగా విదిలించి సహజంగా కాస్తా మధ్యస్థ ఎండలో ఆరనివ్వండి. తాజా గాలిలో ఆరడం వల్ల మృదువుగా ఉంటాయి. అదే విధంగా, ఆరిన తర్వాత ఓ సారి తీసి మరోసారి విదిలించి మడతపెట్టాలి. దీంతో వాటిలోని లూప్స్ అంటే మెత్తగా అనిపించేలా చేసే దారాలు ఉత్తేజితమై మళ్లీ మనకి సాఫ్ట్‌గా మారతాయి. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.




