
వెల్దండ: వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో గాయపడ్డ పోలే శ్రీరాములును సోమవారం వెల్దండ ఉమ్మడి మండల సింగర్ విండో ఛైర్మన్ జూపల్లి భాస్కరరావు పరామర్శించారు. గత 15 రోజుల కిందట విద్యుదాఘాతంతో కల్వకుర్తి మహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరాములకు భాస్కర్ రావు వ్యక్తిగతంగా రూ.20 వేలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, చెదురుపల్లి సర్పంచ్ దన్సింగ్ నాయక్ పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





