
కొత్తకోట గ్రామీణం: మండలంలోని అమడబాకుల సమీపంలో ఉన్న రంగసముద్రం కాలువలో సోమవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కాలువలో ఉన్న ముళ్ల పొదలకు తగిలి ఉండడంతో ఉదయం అటుగా వెళ్లినవారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తి (35) రెండు రోజుల క్రితం కాలువ పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం ఉబ్బి ఉండడంతో గుర్తుపట్టడానికి వీలు కాకుండా పోయింది. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆచూకీ తెలిస్తే కొత్తకోట పోలీసులకు తెలియజేయాలని ఎస్సై విక్రమ్ కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





