
కాలిఫోర్నియా: అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఇంట్లోకి ఒక మహిళ అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించింది. ఆమెను భద్రతా సిబ్బంది ఇంటి బయటే అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలిఫోర్నియాలోని మలీబులో ఉన్న కమల ఇంట్లోకి శుక్రవారం రాత్రి ఈ చొరబాటు జరిగిందని ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది అందించిన సమాచారంతో లాస్‌ ఏంజెలెస్‌ కౌంటీ షరీఫ్‌ డిప్యూటీలు అక్కడికి చేరుకున్నారు. అనుమానిత మహిళను అక్కడి నుంచి పంపించివేశారు. ఆమె వెళ్లిపోవడంతో ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





