
బాలానగర్: సర్ ప్రక్రియలో తప్పులను వేగంగా సరిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హరిప్రియ బీల్ఎల్వో సూచించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయ పల్లి, కేతిరెడ్డిపల్లి గ్రామాలలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను ప్రక్రియను ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో బీఎల్వోలు నోటీసులు ఇచ్చిన ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ నమోదు చేసుకున్న దరఖాస్తులు, సర్‌ పక్రియలో నోటీసుల విచారణ, అభ్యంతరాల నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం వహించకుండా విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు శ్రీనివాసులు, రామ్మోహన్, జీపీవోలు సాయిలు, నాగరాజు, మాజీ సర్పంచ్ శంకర్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






