

- ఎల్పీజీ కస్టమర్లకు భారీ గుడ్‌న్యూస్.. 25 రోజులకే రీఫిల్ బుకింగ్
- గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ బుకింగ్ గడువు తగ్గింపు
- ఎల్పీజీ రీఫిల్‌పై ఆంక్షలు సడలింపు.. కేంద్రం తాజా ప్రకటన
LPG Refill Booking Rule : గ్యాస్ బుకింగ్ కోసం చూస్తున్నారా? ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లోని గ్యాస్ వినియోగదారులకు నిజంగా సూపర్ గుడ్ న్యూస్..
డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.ఇక 25 రోజుల్లోనే రీఫిల్ బుకింగ్ :
ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు కూడా 25 రోజుల వ్యవధిలోనే ఎల్పీజీ గ్యాస్ రీఫిల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధి 45 రోజులుగా ఉంది. తాజాగా 25 రోజులకు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు.ఎల్పీజీ సరఫరా పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, పెండింగ్‌లో ఉన్న రీఫిల్ బుకింగ్‌లు భారీగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది తక్షణమే అమలు చేయాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సురేష్ గోపి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖను కూడా తన పోస్టులో షేర్ చేశారు.
- గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ బుకింగ్ గడువు తగ్గింపు





