
భాగస్వామి పైన ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్! కొందరు విలువైన కానుకలిచ్చి తమ ప్రేమను తెలియజేస్తే.. మరికొందరు ఎదుటివారికి నచ్చిన పని చేస్తూ వారిపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంటారు. భాగస్వామి పైన ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్! కొందరు విలువైన కానుకలిచ్చి తమ ప్రేమను తెలియజేస్తే.. మరికొందరు ఎదుటివారికి నచ్చిన పని చేస్తూ వారిపై ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తుంటారు. మరి, ప్రేమంటే విలువైన కానుకల్లోనే ఉందా? విలాసవంతమైన జీవన శైలి ద్వారా మాత్రమే ఎదుటివారి మనసు గెలుచుకోవచ్చా? అంటే.. కాదంటున్నారు నిపుణులు. ⚛ ఎలాంటి హడావిడీ లేకుండా సింపుల్ గా.. మెచ్చిన రంగు పువ్వులు, నచ్చిన ఫ్లేవర్‌ చాక్లెట్లు ఇచ్చినా.. ఎదుటివారి మనసు సంతోషపడుతుంది. మీ మనసులో ఉన్న ప్రేమా వారికి అర్థమవుతుంది. ⚛ ఎప్పుడైనా భాగస్వామితో కలిసి వెకేషన్‌కి వెడితే ఆ జ్ఞాపకాలు మనసులో పదిలంగా నిలిచిపోతాయి. ఈ క్రమంలో బీచ్‌కి వెళ్లినప్పుడు అక్కడ రకరకాల ఆకృతుల్లో దొరికే గవ్వలు, గులకరాళ్లు.. వంటివి సేకరించే అలవాటు కొంతమందికి ఉంటుంది. వాటినీ మీ భాగస్వామికి స్వీట్‌ మెమరీగా అందించచ్చు. వాటిని అలాగే కాకుండా.. వాటిపై వాళ్ల పేరు రాయించడం, ఫొటోలు ప్రచురించడం.. ఇలా కస్టమైజ్‌ చేయించి కూడా అందించచ్చు. ⚛ మీరిచ్చే కానుకల ద్వారానే కాదు.. మీ చేతల ద్వారా కూడా భాగస్వామిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయచ్చు. ఈ క్రమంలో వారికి ఇష్టమైన వంటకం తయారుచేసి సర్‌ప్రైజ్‌ చేయడం, మీరే స్వయంగా తినిపించడం, వాళ్లకు నచ్చిన ప్రదేశాలకు టూర్‌ ప్లాన్‌ చేసుకోవడం.. వంటివి చేయచ్చు. ⚛ బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా ఈ రోజుల్లో చాలా జంటలకు ఏకాంతంగా సమయం గడిపే అవకాశం దొరకట్లేదు. కానీ వీలు చూసుకొని రోజూ ఒకరికొకరు కాసేపు సమయం కేటాయించుకోవడం అవసరం అంటున్నారు నిపుణులు. భాగస్వామిపై తమ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి దీనిని ఓ అవకాశంగా భావించాలంటున్నారు. ⚛ ఎప్పుడూ ఏదో ఒక కానుకలివ్వడమే కాదు.. పని ఒత్తిడితో అలసిపోయిన భాగస్వామిని ఆ ఒత్తిడిలో నుంచి బయట పడేయడం, బాధలో ఉన్న వారిని ఓదార్చడం కూడా.. భాగస్వామిపై తమకున్న కేరింగ్‌ను, ప్రేమను వ్యక్తం చేసే మార్గాలే అంటున్నారు నిపుణులు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings





