
న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం : పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత వైకాపా సర్కారు నిధులివ్వక ఆగిపోయిన మంచినీటి పథకాలు పట్టాలెక్కించారు. మౌలిక సదుపాయాల కల్పనకు తాజాగా ఉమ్మడి జిల్లాకు రూ.410 కోట్లు మంజూరు చేశారు. హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో(హెచ్‌ఏఎం) చేపట్టనున్న పనులకు పురపాలకశాఖ పాలనా అనుమతులు మంజూరు చేసింది. కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు నగర పాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంస్థలు, గూడూరు నగర పంచాయతీకి కలిపి రూ.246 కోట్లు, నంద్యాల జిల్లాలో నంద్యాల, డోన్, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు పురపాలక సంస్థలు, బేతంచెర్ల నగర పంచాయతీకి కలిపి రూ.164 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఏడు పురపాలక సంస్థలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో 399 వార్డులు ఉన్నాయి.18 లక్షల జనాభా నివాసం ఉంటోంది. శివారు కాలనీలు విస్తరిస్తున్నాయి. అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం లేదు. పాత కాలనీల్లో మంచినీటి లీకేజీ సమస్య తీవ్రంగా ఉంది. కాల్వలు పాతవి కావడంతో మురుగు ముందుకు కదలడం లేదు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించారు. హెచ్‌ఏఎం నిధులు వినియోగించనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




