
తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన అందాల భామలు చాలామందే ఉన్నారు. కొందరు టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తుంటే.. మరికొందరు ఒకట్రెండు చిత్రాలకే పరిమితమై ఇతర భాషల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగులో ఈ అమ్మడు చేసింది రెండు సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆతర్వాత ఇక్కడ అవకాశాలు అందుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ దిశా పటానీ. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ, తన గ్లామర్, ఫిట్నెస్, ఫ్యాషన్‌తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దిశా పటానీ 2015లో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ఆమె నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ‘లోఫర్’ తర్వాత దిశా పటానీ బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.





