
హైదరాబాద్‌: శాసనసభలో 22ఏ భూములపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ( Kavitha ) విమర్శించారు. సిద్ధిపేట జిల్లాలో కవిత, ఆమె భర్త పేరు మీద 37.26 ఎకరాల భూమి ఉందని అసెంబ్లీలో సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి ప్రకటనపై ‘ఎక్స్‌’ వేదికగా కవిత స్పందించారు. ‘‘సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నా. నా కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు సీఎం చెప్పారు. ప్రభుత్వ నిబంధనలకు మించి ఒక్క గజం భూమి నాకు ఎక్కువగా ఉన్నా... ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న దానికన్నా గజం భూమి అదనంగా ఉన్నా... ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని మరోమారు స్పష్టం చేస్తున్నా’’ అని కవిత తెలిపారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశం: సీఎం రేవంత్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





