
చివరికి.. కన్నుమూసిన తండ్రీకుమారులు బెళగావి, న్యూస్‌టుడే : బెళగావి నగరంలో ఇంట్లో ఫ్రిజ్‌ పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన తండ్రీ కుమారులు గజానన రాజారామ ధమోనె (65), ఆయన కుమారుడు రోషన్‌ గజానన ధమోనె (21) బుధవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మరణించారు. సోమవారం అర్ధరాత్రి గజానన నివాసంలో ఫ్రిజ్‌ పేలడంతో ఆయన భార్య శారద, సోదరి భారతి, కుమార్తెలు ప్రియ, గంగ అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. ఇంట్లో ఆభరణాలు, నగదు, వస్తువులు, అన్నీ కాలిపోయాయి. తీవ్రంగా గాయపడిన తండ్రీ కొడుకులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా, వారు కూడా మరణించారు. బాధిత కుటుంబ బంధువులను ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్‌జార్ఖిహొళి పరామర్శించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




