
మానకొండూరు, కరీంనగర్‌ టౌన్‌(ఈటీవీ): మానకొండూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువులో నిర్వహించే వినాయక నిమజ్జన ఏర్పాట్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మానకొండూరు చెరువు, కొత్తపల్లి మండలంలోని చింతకుంట కెనాల్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ గణనాథులను తరలించేందుకు భారీ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మానకొండూరు చెరువులో ప్రస్తుతం నీరు తక్కువగా ఉండటంతో అధికారులతో మాట్లాడి నీటిని నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





