
తెలంగాణ రక్షణ సేన పార్టీ విస్తరణపై అధినేత్రి కల్వకుంట్ల కవిత దృష్టి సారించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు. తాజా నియామకాలతో రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జ్‌ల ఎంపిక పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు నియోజకవర్గాలకు బాధ్యతలు అప్పగించారు. పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను, అనుబంధ విభాగాలకు బాధ్యులను నియమించారు.





