
ఇంటర్నెట్ డెస్క్‌: న్యూయార్క్‌ (New York)లో విషాద ఘటన చోటుచేసుకుంది. సబ్‌వే ట్రాక్‌పై కూర్చున్న ఇద్దరు స్నేహితులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను భారత (Indian origin) సంతతికి చెందిన యువతి మలైకా చిత్రే, నేపాలీ సంతతికి చెందిన యువకుడు నవమ్‌గా అధికారులు గుర్తించారు. లోయర్‌ మాన్‌హట్టన్‌లోని స్ర్పింగ్‌ స్ట్రీట్‌ సబ్‌వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ట్రాక్‌పై ఉన్న వీరిద్దరిని గమనించి లోకో పైలట్‌ అత్యవసర బ్రేకులు వేసినా.. వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. వారు ట్రాక్‌ పైకి ఎందుకు వెళ్లారనే దానిపై స్పష్టత లేదు. నవమ్‌ ప్రమాదవశాత్తూ ట్రాక్‌పై పడిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అతడిని కాపాడేందుకు మలైకా ట్రాక్‌పైకి వెళ్లి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ కాలేజీ స్నేహితులు కాగా.. న్యూజెర్సీ (New Jersey)లో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. జనసేన (Janaena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన జంగం సాయికృష్ణ యూకే గగనతలంలో అరుదైన సాహసం చేశారు. అమెరికాలో జరిగిన పెళ్లిని ఆన్‌లైన్‌లో వీక్షించి వధూవరులను ఆశీర్వదించిన ఘటన ఇటీవల సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలోని వేపలసింగారం గ్రామంలో జరిగింది. తెలుగు తల్లి కన్నుల్లో ఆనందబాష్పాలు వచ్చిన రోజు ఇది అని సిలికానాంధ్ర రజతోత్సవ వేదికపై ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌ ఎరీనాలో ‘సిలికానాంధ్ర’ రజతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌ ఎరీనాలో ‘సిలికానాంధ్ర’ రజతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో వివాహ నిశ్చితార్థాలు కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. కర్నూలుకు చెందిన గోవింద్‌స్వామి, శివశ్యామల దంపతులు తమ కుమార్తె నిశ్చితార్థాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించడం చర్చనీయాంశమైంది. అమెరికాలో ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరగనున్న 8వ నాట్స్ కాన్ఫరెన్స్‌ సంబరాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలెండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలెండ్‌ తెలుగు అసోసియేషన్‌ (POTA) సభ్యులు ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి అద్భుత విజయం సాధించడం సహా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కూటమి ఎన్నారై కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు. తెలుగు నేల ఉన్నంత కాలం.. రామోజీరావు కీర్తి వినిపిస్తుందని దుబాయ్‌లోని ప్రవాసాంధ్రులు కొనియాడారు. రామోజీరావు మృతికి వారంతా సంతాపం ప్రకటించారు. తెలుగువారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. అయోధ్యలో శ్రీరాముని మూర్తి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో సంబరాలు అంబరాన్నంటాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో వందలాది రామభక్తులు.. సుమారు 300 కార్లతో భారీ ర్యాలీ తీశారు. శ్రీరాముణ్ని స్మరించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికాలో.. న్యూజెర్సీలోని సాయిద‌త్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాల‌యంలో కార్తిక పౌర్ణమి వేడుక‌లు వైభ‌వంగా జ‌రిగాయి. సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సింగ‌ర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె శివుడి పాట పాడారు. మంగ్లీ ఆల‌పించిన పాట‌తో భ‌క్తులు మంత్ర ముగ్ధుల‌య్యారు.





