
Ishan Kishan: టీమిండియా యంగ్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా వరుస మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. చెన్నైలో జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌తో పాటు రెస్ట్ లేకుండా నేరుగా టీ20 సిరీస్‌కు రెడీ కావడంతో ఆయన తీవ్ర అలసటకు గురయ్యారు. దీనివల్ల వచ్చే రెండు రోజులు తాను మంచం మీద నుంచే కదలనని, కేవలం నిద్రపోతూ రికవరీపైనే దృష్టి పెడతానని ఇషాన్ సరదాగా, తీవ్ర అలసటతో చెప్పుకొచ్చారు.





