
టీమ్‌ఇండియా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి గాయమైంది. దీంతో ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ నుంచి అతడు వైదొలిగాడు. రాబోయే ఆసియా క్రీడలకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేదానిపైనా సందిగ్ధత నెలకొంది. ఆదివారం అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వరుణ్‌ ఒక వికెట్‌ తీశాడు.




