

- ఆపిల్ ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900
- ఈ మోడల్ కొనుగోలుపై రూ.21వేలు తగ్గింపు
- రూ.78,900కే ఐఫోన్ 17 ఇంటికి తెచ్చుకోవచ్చు
Apple iPhone 17 : ఐఫోన్ లవర్స్ మీకోసం అదిరిపోయే డిస్కౌంట్.. ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఐఫోన్ డ్యూయో మోడల్స్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఐఫోన్ల లాంచ్ సందర్భంగా గత ఏడాదిలో వచ్చిన ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ ధరలు కూడా కంపెనీ భారీగా పెంచింది.
రూ.82,900 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఐఫోన్ 17 ధర ఇప్పుడు (Apple iPhone 17) రూ.99,900కు పెరిగింది. అయినప్పటికీ, మీరు ఈ ఐఫోన్‌ను గత ధర కన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 17పై ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900గా లిస్టు అయింది. ఈ ఐఫోన్ 256GB, 512GB, 1TB అనే 3 స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. ఈ-కామర్స్ వెబ్సైట్లో రూ.82,900కు లిస్టు అయింది. ఇప్పటికీ పాత ధరకే లభిస్తోంది. అదనంగా, ఐఫోన్ 17పై రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. పెరిగిన ధర కన్నా రూ.21వేలు తక్కువగా రూ.78,900కే ఐఫోన్ 17 ఇంటికి తెచ్చుకోవచ్చు.
Read Also : EPFO WhatsApp channel : PF సభ్యులకు గుడ్‌న్యూస్.. ఇక ముఖ్యమైన అప్డేట్స్ .. ఇప్పుడే ఛానల్ ఫాలో అవ్వండి!
ఐఫోన్ 17 ఫీచర్లు :
ఈ ఆపిల్ ఐఫోన్ 6.3-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానెల్‌తో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఇందులో డైనమిక్ ఐలాండ్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఐఫోన్ ఆపిల్ A19 బయోనిక్ చిప్సెట్తో రన్ అవుతుంది. 256GB, 512GB, 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఐఫోన్ 17 బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్లో 48MP ప్రైమరీ కెమెరా, 48MP సెకండరీ కెమెరా ఉన్నాయి. కంపెనీ 18MP సెంటర్-స్టేజ్ సెల్ఫీ కెమెరాను కూడా అందించింది. అదనంగా, ఈ ఫోన్ ప్రత్యేకమైన క్యాప్చర్ బటన్ యాక్షన్ బటన్‌తో వస్తుంది.
ఐఫోన్ 18 ప్రో ప్రీ-ఆర్డర్లు :
భారత మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 18 ప్రో సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ 2 ఆపిల్ ఐఫోన్లను సెప్టెంబర్ 9న భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఐఫోన్ల ధరలు రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతాయి. ప్రీ-ఆర్డర్ చేసేవారికి రూ.7వేల వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. భారత మార్కెట్లో అమ్మకాలు సెప్టెంబర్ 18న ప్రారంభమవుతాయి.





