
India ODI Squad: వెస్టిండీస్‌తో సెప్టెంబర్ 27న తిరువనంతపురం వేదికగా ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియ అత్యంత ఆసక్తికరంగా మారింది. అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తుది జట్టును ఎంపిక చేయడంలో పలు కీలక అంశాలను పరిశీలిస్తోంది. ఫిట్నెస్ సాధించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh pant) పునరాగమనంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఆసియా క్రీడలు (Asian Games) షెడ్యూల్ కారణంగా పలువురు ప్రధాన ఆటగాళ్లు జపాన్ పర్యటనలో ఉండటంతో, వన్డే జట్టు కూర్పు సెలక్టర్లకు పెద్ద సవాలుగా పరిణమించింది. ఇదే సమావేశంలో అగార్కర్ పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించే అంశంపై బోర్డు పెద్దలతో చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.





