
ఇంటర్నెట్‌ డెస్క్‌: సౌదీఅరేబియాలోని ముస్లింల పవిత్రస్థలం మక్కా (Mecca) సమీపంలో హూతీలు (Houthis) చేసిన దాడులను భారత్‌ ఖండించింది (India condemns). ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా శాంతిస్థాపన జరగాలని ఆకాంక్షించింది. అత్యంత పవిత్ర నగరంగా.. మక్కాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ప్రత్యేకమైన అనుబంధం, భక్తి ఉన్నాయని విదేశాంగ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్‌ పేర్కొన్నారు. ఇకనైనా దాడులు ఆపాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఒక డ్రోన్‌ మక్కా వద్ద నిషేధిత గగనతలంలోకి ప్రవేశించికముందే రాయల్ సౌదీ ఎయిర్‌ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని, నిర్వీర్యం చేశాయని సైనిక ఉన్నతాధికారి తుర్కి అల్‌ మాలికి వెల్లడించారు. దాడుల నేపథ్యంలో మక్కా నగరంతోపాటు జెడ్డా, తైఫ్‌లలో హై అలర్ట్‌ ప్రకటించారు. మక్కా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి అలర్ట్‌ ప్రకటించడం ఇదే మొదటిసారి. అయితే తాము సౌదీ ( Saudi Arabia )లోని పలు ప్రాంతాలను లక్ష్యం చేసుకున్నామే గానీ.. మతపరమైన ప్రదేశాల జోలికి వెళ్లలేదని హూతీలు పేర్కొన్నారు. ఇదీ చదవండి: మక్కా సమీపంలోకి హూతీల డ్రోన్‌.. కూల్చివేసిన సౌదీ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





