
చైనా కృతిమ సూర్యుణ్ని తయారు చేస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారత్ కూడా ఆర్టిఫిషియల్ సన్ను తయారు చేస్తోందనే సంగతి మీకు తెలుసా? కృతిమ సూర్యుడి తయారీలో భారత శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. గుజరాత్లోని రీసెర్చ్ సెంటర్లో ఎస్ఎస్టీ-1 టోకమాక్పై అత్యంత శక్తివంతమైన గైరోట్రాన్ను అమర్చారు. దీని ద్వారా ప్లాస్మాను మరింతగా వేడి చేయడంతోపాటు స్థిరమైన పరిస్థితుల వద్ద అది ఎలా ప్రవర్తిస్తుందో అధ్యయనం చేయడానికి వీలవుతుంది.





