
హైదరాబాద్‌: భారత్‌లో హైదరాబాద్‌ అంతర్భాగం కావడానికి ఎంతోమంది మహనీయుల బలిదానం కారణమని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. తొలుత పోలీసు అమరవీరుల స్మృతి స్తూపం వద్ద ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడిన యోధులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. మహనీయుల పోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, కేంద్రమంత్రులు గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు సాయుధ బలగాల నుంచి ఉప రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ కళారూపాలు, వేయిస్తంభాల గుడి, బతుకమ్మ శకటాలను ప్రదర్శించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




