
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. అబార్షన్ ట్యాబ్లెట్ వికటించి ఓ యువతి మృతి చెందింది. ఆ యువతికి కొన్ని నెలల క్రితం ఒక యువకుడితో పరిచయం ఏర్పడగా.. అది కాస్తా లైంగిక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఆ యువతి గర్భం దాల్చగా.. దాన్ని తొలగించేందుకు ఆ యువకుడు అబార్షన్ ట్యాబ్లెట్ తీసుకువచ్చి ఇచ్చాడు. అది వేసుకున్న తర్వాత యువతి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.





