
పహాడీ షరీఫ్‌ (హైదరాబాద్‌): నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వెనుక నుంచి టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను అత్తాపూర్‌లోని సులేమాన్‌ నగర్‌కు చెందిన ఇస్మాయిల్‌ ఖాన్‌ (45), బుష్రా బేగం (24)గా గుర్తించారు. ఇటీవల కుమార్తెకు పెళ్లి కుదిరింది. దానికి సంబంధించిన సామగ్రి కోసం తండ్రి, కుమార్తె వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




