
మల్కాజిగిరి: చర్లపల్లిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి సుమారు 6 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. చర్లపల్లిలోని రైల్వే కాలనీలో అద్దెకు ఉంటున్న రాజేశ్‌ దంపతులు వినయకచవితి నేపథ్యంలో తమ స్వగ్రామం జనగామకు వెళ్లారు. పండగ అనంతరం ఇంటికి తిరిగి రాగా వెనుక తలుపులు తెరిచి ఉండడం గమనించి బీరువాను పరిశీలించగా అందులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





