
హనుమకొండ: హనుమకొండ పబ్లిక్ గార్డెన్ మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు హనుమకొండ వైపు వస్తోంది. ఒక్కసారిగా అతివేగంగా మలుపు తిరగడంతో బస్సుకు విద్యుత్‌ వైర్లు చుటుకున్నాయి. అవి తగిలి అక్కడే ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది. వృక్షం కూలడంతో దాని కింద ఉన్న రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదా గాయాలు కాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు అతివేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకటరత్నం వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్సుపై పడిన చెట్లను తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.