
హైదరాబాద్, సెప్టెంబర్ 15: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, వేటకొడవల్లో మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బండ్లగూడలోని సుప్రీమ్ వైన్స్ వద్దకు చేరుకున్న బాధితుడు.. వారి కంటపడకుండా వైన్స్‌లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ హంతకులు అతడిని వదిలిపెట్టలేదు.. వైన్స్‌లోకి వెళ్లి మరి బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.





