

Bigg Boss Today Promo : మొదటి వారంలో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వీకెండ్ కూడా అయిపోయింది. దీంతో నేడు నామినేషన్స్ పర్వం కొనసాగనుంది. నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో బిగ్ బాస్ రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలు చూస్తుంటే మళ్ళీ అగ్నిపరీక్ష – సెలబ్రిటీల బ్యాచ్ గొడవ మొదలయిందని తెలుస్తుంది.
బిగ్ బాస్ రోప్స్ తీసే టాస్కే ఇచ్చాడు. ఆ టాస్క్ పూర్తి చేసి నామినేషన్స్ చేయమని చెప్పాడు. ఎప్పట్లాగే రోహిత్ – త్రిగున్ గొడవ పడ్డారు. ఇవాళ కొత్తగా షాలిని – నరేష్ గొడవపడ్డారు. నరేష్ కి సపోర్ట్ గా వర్షిణి వచ్చింది. దీంతో వర్షిణి – షాలిని కొట్టుకునేదాకా వెళ్లారు. షాలిని – సుధీర్ మధ్య గొడవ అయింది. సృష్టి – త్రిగున్ మధ్య గొడవ అయింది.ఝాన్సీ – రోహిత్ మధ్య గొడవ అయింది. ఇవన్నీ చూస్తుంటే నేటి ఎపిసోడ్ నామినేషన్స్ ఫుల్ ఫైర్ తో అందరి మధ్య గొడవలతో సాగబోతున్నాయి అని తెలుస్తుంది.
Also See : shiva jyothi : ఫ్యామిలీతో కలిసి యాంకర్ శివజ్యోతి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
మీరు కూడా నేటి బిగ్ బాస్ ప్రోమోలు చూసేయండి..





