

Bigg Boss Nominations : మొదటివారం బిగ్ బాస్ పూర్తయింది. మొదటి వారంలోనే ఇద్దర్ని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున చాలా మందిపై ఫైర్ అయ్యాడు. మొదటి వారం అగ్నిపరీక్ష బ్యాచ్ వర్సెస్ సెలబ్రిటీల బ్యాచ్ అన్నట్టే సాగింది. ఇక రెండవ వారం మొదలైంది. బిగ్ బాస్ దశావతారాల్లో మొదటి వారం మహాపరిక్ష సాగితే రెండవ వారం పవర్ ఆఫ్ పీపుల్ అనే సిగ్మెంట్ జరగనుంది.
రెండవ వారం నేడు మొదలైంది. మొదట సుధీర్ – సృష్టి కాసేపు మాట్లాడుకున్నారు. నిన్న అడిగినందుకు బిగ్ బాస్ దేబ్జానికి కాఫీ పంపించాడు. అది ముకేశ్ తో షేర్ చేసుకుంటాను అని చెప్పింది. అనంతరం మళ్ళీ రోహిత్ – త్రిగున్ మధ్య వాషింగ్ గురించి డిస్కషన్ జరిగింది. రోహిత్ కి నిన్న నాగార్జున ఇచ్చిన పనిష్మెంట్ కప్పులను అయిష్టంగా కడిగాడు. షాలిని పక్కన ఉండి నేనే దగ్గరుండి చేయించాను అని ఓవర్ యాక్షన్ చేసింది. నిన్న సుధీర్ గెలుచుకున్న పవర్ బాక్స్ ని ఓపెన్ చేయించాడు బిగ్ బాస్. అందులో ఎవర్ని ఎప్పుడు అయినా నామినేట్ చేసే పవర్ ఉంది.
అనంతరం నామినేషన్స్ కి అందర్నీ గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు బిగ్ బాస్. బిగ్ బాస్ రమ్మంటే షాలిని ఇంకా రెడీ అవుతూ కూర్చుంది. దాంతో షాలిని ని బిగ్ బాస్ తిట్టాడు. ఇంకోసారి లేట్ చేస్తే నెక్స్ట్ టైం డైరెక్ట్ నామినేట్ చేస్తా అన్నారు. నామినేషన్స్ కి ఒక గేమ్ పెట్టారు. ఇద్దరిద్దర్ని పిలుస్తాను. ఒక స్థంబానికి కట్టి ఉన్న తాళ్లు తీసి ఎదురుగా ఉన్న గోల్డ్, సిల్వర్ గొడ్డలిలో ఏదో ఒకటి అందుకోవాలి. సిల్వర్ గొడ్డలి అందుకుంటే ఒకర్ని, గోల్డ్ గొడ్డలి అందుకుంటే ఇద్దర్ని నామినేట్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు. అలాగే ఓడిపోయినవాళ్లు కూడా నామినేట్ అవుతారు అని చెప్పాడు.
Also Read : Naga Shaurya : భార్యతో కలిసి హీరో నాగశౌర్య వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
మొదట ఝాన్సీ, సుధీర్ లను పిలవగా సుధీర్ గెలిచాడు. సుధీర్ గోల్డ్ గొడ్డలి తీసుకొని మొదట త్రిగున్ ని నామినేట్ చేసాడు. మైండ్ గేమ్ ఆడాడు, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పాడు అని త్రిగున్ ని నామినేట్ చేసాడు. అనంతరం షాలినిని నామినేట్ చేసాడు. తన పవర్ మిస్ యూజ్ చేసుకుందని, తనకు వచ్చిన పని చేయకుండా వేరే వాళ్లకు ఇచ్చినందుకు అని చెప్పాడు. దీంతో షాలిని నా పవర్ నా ఇష్టం అని వాదన పెట్టింది. రోహిత్ కూడా షాలిని సపోర్ట్ గా తన వాదన వినిపించాడు.
అనంతరం దేబ్జానీ, కృష్ణుడులను పిలవగా దేబ్జానీ గెలిచింది. సిల్వర్ గొడ్డలి తీసుకొని త్రిగున్ ని నామినేట్ చేసింది.
అనంతరం వర్షిణి, రోహిత్ లను పిలవగా రోహిత్ గెలిచాడు. గోల్డ్ గొడ్డలి తీసుకొని ఊహించినట్టే త్రిగున్ ని నామినేట్ చేసాడు. అనంతరం ఝాన్సీ ని నామినేట్ చేసాడు. ఝాన్సీ రోహిత్ పై ఫైర్ అయింది. నీ గ్రూప్ లో ఉండట్లేదు కాబట్టి నన్ను నామినేట్ చేస్తున్నావు అని ఫైర్ అయింది. మధ్యలో ఝాన్సీకి సపోర్ట్ గా త్రిగున్ గొడవ పెట్టుకున్నాడు.
అనంతరం నరేష్, షాలినిలను పిలవగా నరేష్ గెలిచాడు. సిల్వర్ గొడ్డలి తీసుకొని షాలిని ని నామినేట్ చేసాడు. షాలిని డిఫెండ్ చేసుకోడానికి నరేష్ పై ఫైర్ అయింది. ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. దీంతో నరేష్ వినకుండా వెళ్ళిపోయాడు.
Also See : You Tuber Viraajita : యూట్యూబర్ విరాజిత వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
అనంతరం త్రిగున్, సృష్టి లను పిలవగా త్రిగున్ గెలిచి గోల్డ్ గొడ్డలి తీసుకున్నాడు. త్రిగున్ మొదట సుధీర్ ని కట్టప్పగా మారినందుకు నామినేట్ చేసాడు. తన మంచి కోసం చెప్పిన మాటలను తన గేమ్ కోసం వాడినందుకు సుధీర్ ని నామినేట్ చేయడంతో సుధీర్ – త్రిగున్ గొడవ పడ్డారు. ఆ తర్వాత రోహిత్ ని నామినేట్ చేసాడు. అగ్నిపరీక్ష వాళ్ళను బ్యాచ్ గా చేసినందుకు, చెప్పిన పనులు కిచెన్ లో చేయనందుకు. దీంతో రోహిత్ – త్రిగున్ గొడవ పడ్డారు. ఈ గొడవ మధ్యలో షాలిని, వర్షిణి వచ్చి గొడవ పడ్డారు. ఈ గొడవలో సుధీర్ కూడా వచ్చాడు. సుధీర్ కూడా ఇవాళ నామినేషన్స్ నుంచి మెల్లిగా అగ్నిపరీక్ష టీమ్ కి సపోర్ట్ చేసి కట్టప్పలా మారాడు. దీంతో త్రిగున్ సుధీర్ ని కట్టప్ప అన్నాడు. సృష్టి దగ్గర మెప్పు పొందడానికి సుధీర్ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది.
అనంతరం అమన్, ముకేశ్ లను పిలవగా అమన్ గెలిచాడు. గోల్డ్ గోడలు తీసుకున్నాడు. మొదట రామ్ ప్రసాద్ కర్చీఫ్ గేమ్ వల్ల నామినేట్ చేసాడు. అనంతరం ఝాన్సీ ని నామినేట్ చేసాడు. దీంతో ఝాన్సీ మరోసారి నేనెవ్వరి గ్రూప్ లో ఉండను నా ఆట నేను ఆడతను అని గట్టిగానే చెప్పింది.
Also See : Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
అనంతరం రామ్ ప్రసాద్, వంశీ లను పిలవగా వంశీ గెలిచి గోల్డ్ గొడ్డలి తీసుకున్నాడు. దేబ్జానీ, ముకేశ్ లని సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేసాడు.
ఇంతటితో నామినేషన్స్ పూర్తయ్యాయి అని బిగ్ బాస్ చెప్పాడు. దేంతో ఈ వారం నామినేషన్స్ లో షాలిని, త్రిగున్, ఝాన్సీ, ముకేశ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ లు ఉన్నారు. ఇందులో త్రిగున్ కి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.





