
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. గడిచిన 24 గంటల్లో సిద్దిపేట జిల్లా కొండపాకలో అత్యధికంగా 145.3 మి.మీ. వర్షం నమోదైంది. హైదరాబాద్‌లోనూ ఆదివారం భారీ వర్షం కురిసింది. బేగంపేటలో 93 మి.మీ. వర్షపాతం నమోదైంది.





