
గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న సియా అనే యువతిని కొందరు వ్యక్తులు కారులో వెంబడించారు. ఆపమని చెప్పినా ఆగకపోవడంతో, వెనుక నుండి కారుతో బైక్‌ను బలంగా ఢీకొట్టారు. దీంతో సియా రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన మొత్తం ఆమె బైక్‌లోని యాక్షన్ కెమెరాలో రికార్డ్ అయింది. మహిళా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.




