
భారత సంతతి యువతి, ఆమె స్నేహితుడి పైనుంచి రైలు దూసుకెళ్లడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదం అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలోని లోయర్ మాన్హటన్ సబ్వే స్టేషన్లో జరిగింది. మృతులను న్యూజెర్సీలోని డేటన్ నివాసి మలైకా చిత్రె (24), అదే రాష్ట్రం సేర్విల్లేకు చెందిన నవం కౌల్గా గుర్తించారు.