
Gundeninda Gudigantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు' బుధవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా ఆర్డర్ కోసం డబ్బు సర్దుబాటు చేసుకునే సమయంలో ఆమె చెల్లెలు సుమతి రూ.3 లక్షలు తీసుకొచ్చి ఇస్తుంది. అక్క చేసిన త్యాగాలను గుర్తుచేసిన సుమతి.. ఈ సమయంలో సాయం చేయడం తమ బాధ్యత అని చెబుతుంది. దీంతో మీనా భావోద్వేగానికి గురవుతుంది. మరోవైపు హోటల్‌లో శృతికి చేదు అనుభవం ఎదురవుతుంది. ఇద్దరు యువకులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తారు. ఒకరు శృతిని తాకేందుకు ప్రయత్నించడంతో ఆమె వేడి సూప్‌ను వారిపై పోస్తుంది. అయితే హోటల్ మేనేజర్ నీతూ శృతినే తప్పుపట్టి సారీ చెప్పమంటుంది.



