
రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌), ముంబయి.. 10 అసిస్టెంట్‌ ఆఫీసర్‌ (సెక్రటేరియల్‌) పోస్టులు ప్రకటించింది. వీటికి పీజీ, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌ డిప్లొమాతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష, స్కిల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. కం ప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఇంగ్లిష్, హిందీల్లో రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 50 ఇస్తారు. రెండో భాగంలో జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులు ఉంటాయి. వ్యవధి 90 నిమిషాలు. ఆన్‌లైన్‌ టెస్టు తేదీని అభ్యర్థులకు అడ్మిట్‌ కార్డు ద్వారా తెలియజేస్తారు. అర్హత: 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, పీజీలతో పాటు ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌/ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌/ సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌/ మోడ్రన్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ డిప్లొమా/ స్టెనోగ్రఫీ కోర్సు పూర్తిచేయాలి. సంబంధిత రంగంలో ఉద్యోగానుభవం ఉండాలి. షార్ట్‌హ్యాండ్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్, డ్రాఫ్టింగ్, ఎంఎస్‌-వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు: 01.07.2026 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ-ఎన్‌సీఎల్, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు ఫీజు ఉండదు. వేతన శ్రేణి: నెలకు రూ.30,000 - 1,20,000. మూల వేతనానికి అదనంగా వీడీఏ, పెర్క్స్, హెచ్‌ఆర్‌ఏ, పీఆర్‌పీ, పీఎఫ్, గ్రాట్యుటీ, యాక్సిడెంట్‌ ఇన్‌స్యూరెన్స్, వైద్య, పెన్షన్‌ సదుపాయాలుంటాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.09.2026 వెబ్‌సైట్‌: www.rcfltd.com/ .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





