
పలువురు శాస్త్రవేత్తలు, విద్యావేత్తల విజ్ఞప్తి ముంబయి: ఈ20 ఇంధన విధానానికి తక్షణం అడ్డుకట్ట వేయాలని, జాతీయ పరీక్షల సంస్థను (ఎన్‌టీఏ) రద్దు చేయాలని, క్షుద్ర విద్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చట్టం చేయాలని పలువురు శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని సూచించారు. ముంబయిలో జరిగిన ‘ఇండియా మార్చ్‌ ఫర్‌ సైన్స్‌’ సందర్భంగా ఈ ఉమ్మడి విజ్ఞప్తిని జారీ చేశారు. మిథ్యా విజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ విధానాల్లో సహేతుకత లేకపోవడం, విద్య- పరిశోధన రంగాల్లో తగ్గుతున్న ప్రభుత్వ పెట్టుబడులపై వీరంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి పంపిన వినతి పత్రంపై పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.రఘునాథన్, శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ ఎస్‌.జి.దానీ తదితరులు సంతకాలు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





