
దిల్లీ: వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ‘ఏ వ్యక్తి, వ్యాపార సంస్థ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్, ట్రేడ్‌మార్క్, పేటెంట్‌ ఏజెంట్, న్యాయవాది కూడా భారత పేటెంట్‌ కార్యాలయ (ఐపీఓ) అధికారిక లోగోను ఏ మాధ్యమంలోనూ ప్రదర్శించరాదని, నకలు చేయరాదని, వినియోగించరాదని’ పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఆదేశాలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు, ఏజెన్సీలు, కార్పొరేట్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ లీగల్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు, అనధీకృత సేవా సంస్థలు తమ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలు, మార్కెటింగ్‌ సామగ్రి, స్టేషనరీ, పెయిడ్‌ డిజిటల్‌ ప్రకటనల్లో ఐపీఓ అధికారిక లోగో, చిహ్నం, డిజైన్‌ను చట్ట విరుద్ధంగా ఉపయోగిస్తున్నట్లు ‘పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్క్‌ల కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయం (సీజీపీడీటీఎం) దృష్టికి వచ్చిందని తెలిపింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం కింద ఉన్న చట్టబద్ధమైన అధికారాన్ని సూచించే అధికారిక ప్రభుత్వ గుర్తింపు చిహ్నమే ఈ లోగో అని అందులో పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





