
బెంగుళూరు (చిత్రదుర్గం): కారు నడుపుతున్నప్పుడు హెల్మెట్‌ ధరించలేదని ఓ వ్యక్తికి రూ.500 జరిమానా పడింది. ఈ వింత ఘటన కర్ణాటకలోని అథని పట్టణంలో చోటుచేసుకుంది. బెల్గామ్ జిల్లా అథని పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో ఓ కారుకు ట్రాఫిక్‌ పోలీసులు అమర్చిన ఏఐ కెమెరా ఫొటో తీసి ఆటోమెటిక్‌ వ్యవస్థ ద్వారా జరిమానా వేసింది. హెల్మెట్‌ ధరించనందుకు ఫైన్‌ విధించినట్లు కారు నడిపిన వ్యక్తి వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ పంపింది. మెసేజ్‌ను చూసి విస్తుపోయిన కారు చోదకుడు సుభాష్‌ వెంటనే హెల్మెట్‌ ధరించి కారు నడుపుతూ నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కారు నడిపేవారు సైతం హెల్మెట్‌ ధరించాలా అని పోలీసులను ప్రశ్నించారు. అనంతరం పొరపాటును గ్రహించిన పోలీసులు సదరు వ్యక్తికి వేసిన జరిమానాను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆటోమెటిక్‌ వ్యవస్థ వల్ల ఇది జరిగిందని, పొరపాటు గుర్తించామని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






