
హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ ఘటనలో 16 సంవత్సరాల మైనర్పై 8 మంది వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అం హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ ఘటనలో 16 సంవత్సరాల మైనర్పై 8 మంది వ్యక్తులు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, బాధితురాలు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమెకు పదో తరగతి చదువుతున్న సమయంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా జెర్రీ వరుణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం, జెర్రీ ఆమెకు మత్తు మందు కలిపిన చాక్లెట్ తినిపించి, తన కారులో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బాధితురాలికి మత్తు మందుకు అలవాటు పడింది. జెర్రీ వరుణ్ తరువాత ఆమెకు రోమల వరుణ్ అనే మరో యువకుడిని పరిచయం చేశాడు. ఇతను కూడా బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి, ఈ నెల 8న ఆమెను మందలించాడు. దీంతో, బాలిక 9వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చి బొల్లారం రైల్వే స్టేషన్కు చేరుకుంది. బొల్లారం రైల్వే స్టేషన్లో బాధితురాలిని నీరజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. నీరజ్ తన స్నేహితుడు విక్కీని అక్కడికి పిలిపించి, ఇద్దరు కలిసి బాలికకు మత్తు మందు ఇచ్చి, ఆమెపై వేర్వేరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత విక్కీ తన మరో స్నేహితుడైన నిఖిల్ సహాయంతో ఆమెను దూలపల్లికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు వ్యక్తులు కూడా వీరితో కలిసి ఓ ఓయో గదిలో ఆమెపై లైంగిక దాడి చేశారు. అనంతరం బాధితురాలిని విక్కీ ఇంటికి తీసుకెళ్లి అక్కడ బంధించారు. ఆటోలో తీసుకెళ్తుండగా బాలిక కేకలు వేయడంతో, విక్కీ ఇంటి నుంచి తప్పించుకున్న బాలిక 10వ తేదీన బొల్లారం రైల్వే స్టేషన్కు చేరుకుంది. కానీ విక్కీ మరియు అతని స్నేహితుడు గణేశ్ ఆమెను అడ్డుకుని, బలవంతంగా మత్తు మందు ఇచ్చి మేడ్చల్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లారు.





