
గుడ్లలో ప్రోటీన్లు, బయోటిన్ ఎక్కువగా లభిస్తుంది. ఇవి కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో జుట్టు మూలాల నుంచి బలంగా, దృఢంగా మారుతుంది. పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. పాలకూర తింటే జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతాయి. చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. చిలగడదుంపలు తింటే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అవకాడో తింటే జుట్టు ఒత్తుగా మారుతుంది. బాదం, వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా విటమిన్ ఇ, బి, జింక్ ఎక్కువగా లభిస్తుంది. నట్స్ తింటే జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుంది. గుమ్మడి గింజలు, చియా విత్తనాలు వంటివి తినడం వల్ల శరీరానికి కావాల్సిన జింక్, సెలీనియం అందుతాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మార్చుతాయి. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. బెర్రీస్ తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కందిపప్పులో ఐరన్, జింక్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సాయపడతాయి.





