
చాలామంది అనుకునే దానికంటే ఈ సమస్య ఎక్కువమందిలోనే ఉంటుంది. అయితే ఇది వృద్ధాప్యంలో వచ్చే సహజమైన లేదా తప్పించుకోలేని సమస్య మాత్రం కాదు. వయసు పెరిగే కొద్దీ మలాన్ని ఆపుకునే కండరాలు, నరాలు బలహీనపడటం వల్ల వృద్ధులలో ఈ ముప్పు కొద్దిగా ఎక్కువ. కానీ కేవలం వయసు మాత్రమే దీనికి కారణం కాదు. కాన్పు సమయంలో జరిగే గాయాలు, పేగు సమస్యలు, శస్త్రచికిత్సలు, నరాల బలహీనత, దీర్ఘకాలిక విరేచనాలు, కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇది రావచ్చు. తీవ్రమైన డయేరియా ఉన్నప్పుడు అప్పుడప్పుడు లీక్ అవ్వడం వేరు, కానీ పదే పదే ఇలా జరగడాన్ని కేవలం ‘వయసైపోయింది’ అని సరిపెట్టుకోకూడదు. వైద్యులను సంప్రదిస్తే సరైన కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి, కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ సమస్యలు కలిసి ఉండొచ్చు. ప్రారంభ సంకేతాలు చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి సిగ్గుతోనో లేదా సాధారణ సమస్య అనుకునో చాలామంది వదిలేస్తారు. మల లీకేజీ సమస్య పదే పదే జరుగుతున్నా, రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తున్నా, ప్యాడ్స్ వాడాల్సి వస్తున్నా వెంటనే నిపుణుల్ని కలవాలి. ముఖ్యంగా ముందుగా రోగి ఆహారపు అలవాట్లు, మందుల వివరాలు, రోజువారీ విసర్జన తీరు, గత సర్జరీలు లేదా ప్రసవాల చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆహార మార్పులు ఎంతో మేలు చేస్తాయి. కీగెల్ (Kegel) వ్యాయామాలు మలద్వార, పెల్విక్ కండరాలను బలోపేతం చేసి, నియంత్రణను మెరుగుపరచడంలో బాగా సాయపడతాయి. అయితే ఇది అందరిలోనూ, అన్ని రకాల సమస్యలనూ పూర్తిగా నయం చేయలేకపోవచ్చు. తీవ్రమైన కండరాల చీలికలు, నరాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో వీటికి అదనంగా ఇతర చికిత్సలు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. పెల్విక్ ఫిజియోథెరపిస్ట్ సమక్షంలో సరైన పద్ధతిలో ఈ వ్యాయామాలు నేర్చుకోవడం మంచిది. వైద్యులు వ్యాయామాలతో పాటు మందులు, ఆహార నియమాలు కలిపి సూచిస్తారు. ప్రధాన కారణం బిడియం, సిగ్గు, నలుగురిలో చులకనవుతామేమోనన్న భయం. అలాగే ఇది వృద్ధాప్యం వల్ల లేదా ప్రసవం వల్ల వచ్చే సహజమైన మార్పు అని, దీనికి చికిత్స ఉండదని చాలామంది పొరబడుతుంటారు. ఎవరిని సంప్రదించాలో కూడా తెలియదు. దీనివల్ల ప్రయాణాలు మానేసి, బంధుమిత్రులకు దూరమై, నిరంతర ఆందోళనతో గడుపుతుంటారు. ఇది ఏమాత్రం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఇది పూర్తిగా నయం చేయగల ఒక ఆరోగ్య సమస్య మాత్రమేనని గుర్తించి సరైన సమయంలో వైద్యుల్ని కలవాలి. సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు డాక్టర్ అనుపమ ఎన్. కె. సీనియర్ కన్సల్టెంట్ - మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు.





